Surya: ఆ హీరోయిన్‌‌ అందాలకు సూర్య ఫ్లాట్.. ఫీలింగ్స్ ఆపుకోలేక అలా చేస్తున్నాడా?

by Disha Web Desk 6 |
Surya: ఆ హీరోయిన్‌‌ అందాలకు సూర్య ఫ్లాట్.. ఫీలింగ్స్ ఆపుకోలేక అలా చేస్తున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయనకు తెలుగులోనూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీనికి శివ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. కాగా ఇందులో సూర్య ఏకంగా ఐదు పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు సెలబ్రీటీలపై పలు పోస్టులు పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాడు. తాజాగా, హీరో సూర్య ఓ హీరోయిన్‌పై మనసు పారేస్కున్నట్టు ఓ పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు. ‘‘సూపర్ స్టార్ సూర్యకి దిశా పటాని అంటే చాలా ఇష్టం. కంగువ షూటింగ్ సెట్‌లో ఆమె హాట్ నెస్ చూసి సూర్య తన ఫీలింగ్స్ ను ఆపుకోలేకపోతున్నాడు. అందుకే రోజూ దిశాను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిశా హాటెస్ట్ గర్ల్ గా సూర్య ఫీల్ అవుతున్నాడు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో సూర్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kriti Sanon about Prabhas :ప్రభాస్‌పై కృతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీరిపై వస్తున్న రూమర్స్ నిజమే..!

Next Story