- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిషబ్ శెట్టికి జై హనుమాన్ పారితోషికం విషయంలో రెండు ఆప్షన్లు
జై హనుమాన్ చిత్ర పారితోషికం విషయంలో రిషబ్ శెట్టి ముందు రెండు క్రేజీ ఆప్షన్స్

దిశ, వెబ్ డెస్క్: హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 2026 ఫిబ్రవరి 22న హంపిలోని అంజనాద్రిలో ఘనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు గాను రిషబ్ శెట్టికి ఈ మూవీ నిర్మాణ సంస్థ భారీ పారితోషకం ఆఫర్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు రెండు రకాల పారితోషకం ఎంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొదటి ఆప్షన్: సుమారు ₹20 కోట్ల పారితోషకం తీసుకోవడం, అదనంగా సినిమా లాభాల్లో 33 శాతం వాటా పొందడం.
రెండో ఆప్షన్: సినిమా లాభనష్టాలతో సంబంధం లేకుండా ₹80 కోట్లు ఫిక్స్‌డ్ పారితోషకం ముందుగానే తీసుకోవడం.
ప్రస్తుతం నిర్మాణ సంస్థ మాత్రం ఒకేసారి ₹80 కోట్లు ఫిక్స్‌డ్‌గా ఇవ్వడం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే హీరో రిషబ్ శెట్టి మాత్రం ₹20 కోట్లు + లాభాల్లో వాటా ఉన్న మొదటి ఆప్షన్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.






