'జన నాయగన్' ముందు రెండు ఆప్షన్లు.. నిర్మాతల అడుగులు ఎటువైపు?

by Pulgam srinivas |

'జన నాయగన్' సినిమా జూలై 16, 23 తేదీల్లో ఏదో ఒక రోజున విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

జన నాయగన్ ముందు రెండు ఆప్షన్లు.. నిర్మాతల అడుగులు ఎటువైపు?
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది పొంగల్ కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అందుకు అనుగుణంగా విడుదల తేదీని కూడా ప్రకటించింది. అయితే సెన్సార్‌కు సంబంధించిన కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత పలు విడుదల తేదీలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, మేకర్స్ మాత్రం అధికారికంగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఈ సినిమా విడుదల తేదీపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ జూలై 16న విడుదల చేయాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు, డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసిన వారు మాత్రం జూలై 23న విడుదల చేయడం మరింత అనుకూలమని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో నిర్మాతలు ఓటీటీ సంస్థ సూచించిన తేదీని ఖరారు చేస్తారా? లేక డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు జూలై 23న సినిమాను విడుదల చేస్తారా? అనే అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Next Story