- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ మూవీ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్.. వంశీ పైడిపల్లి మాస్టర్ ప్లాన్?
సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి కాంబో చిత్రానికి థమన్, అనిరుధ్ రవిచందర్‌ను సంగీత దర్శకులుగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా థమన్, అనిరుధ్ రవిచందర్‌ను వంశీ పైడిపల్లి ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఒకరు పాటలకు సంగీతం అందించనుండగా, మరొకరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పని చేస్తే మూవీ వర్క్ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉండటంతో పాటు, ఒకరు సాంగ్స్.. మరొకరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తే ఔట్‌పుట్ కూడా అద్భుతంగా ఉంటుందనే ఆలోచనతోనే వంశీ పైడిపల్లి ఈ మాస్టర్ ప్లాన్ చేసి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.






