- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాని ‘ది ప్యారడైజ్’లో ఇద్దరు డిజాస్టర్ బ్యూటీస్.. పెద్ద సాహసమే చేస్తున్నావన్నా అంటూ కామెంట్స్
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise).

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise). ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) హై వోల్టేజ్ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే అంచనాలు నెక్ట్స్ లెవెల్‌ను చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా అనిరుధ్ రవిచందర్(Anirudh Ravinder) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ప్యారడైజ్ మూవీలో నాని సరసన ఇద్దరు డిజాస్టర్ బ్యూటీస్ నటిస్తున్నట్లు సమాచారం. వారిలో ఒకరైన భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sre Borse) మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా.. మరో బ్యూటీ స్వాసిక(Swasika) ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నదట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు నాని అన్న పెద్ద సాహసమే చేస్తున్నాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






