చరణ్ కోసం ఇద్దరు దర్శకులు.. తన బలం మొత్తాన్ని వినియోగిస్తున్న నాగ వంశీ

by Pulgam srinivas |

ప్రస్తుతం నాగ వంశీ, రామ్ చరణ్ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్–గౌతమ్ తిన్ననూరి ఇద్దరిలో ఒకరిని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

చరణ్ కోసం ఇద్దరు దర్శకులు.. తన బలం మొత్తాన్ని వినియోగిస్తున్న నాగ వంశీ
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘పెద్ది’ చిత్రాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల అనంతరం చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా, ‘RC 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని కూడా దాదాపు ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ బ్యానర్‌లో సినిమా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కథ మరియు దర్శకుడు మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. దీంతో నిర్మాత నాగ వంశీ తన బలం మొత్తాన్ని వినియోగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సితార బ్యానర్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, గౌతమ్ తిన్ననూరి ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఒకరిని చరణ్ ప్రాజెక్ట్ కోసం ఒప్పించేందుకు నాగ వంశీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో? లేక కొత్త దర్శకుడిని రంగంలోకి దింపుతాడో అన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

Next Story