తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. నా ప్రార్థనలకు ఫలితం దక్కబోతుందంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

బుల్లితెర నటి, టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సమీరా(sameerasherief) అందరికీ సుపరిచితమే.

తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. నా ప్రార్థనలకు ఫలితం దక్కబోతుందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి, టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సమీరా(sameerasherief) అందరికీ సుపరిచితమే. ఆమె ఆడపిల్ల, అభిషేకం(Abhishekam), ముద్దు బిడ్డ, భార్యామణి(Bharyamani), మూడు ముళ్ల బంధం వంటి సీరియల్స్‌లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు షోల్లో యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకుల మనసులు దోచేసింది. అంతేకాకుండా పలు చిత్రాల్లోనే ఆమె నటించి మెప్పించింది. ఇక 2019లో అన్వర్ జాన్‌(Anwar John)ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. 2020లో ప్రెగ్నెంట్ అయింది. కానీ గర్భం కోల్పోయింది. రెండోసారి అర్హాన్(Arhan) పుట్టాడు. ఇక 2023లో కూడా మూడో సారి గర్భం దాల్చగా.. బిడ్డ ఎదుగుదల ఆగిపోవడంతో మళ్లీ నిరాశ తప్పలేదు.

ఇటీవల తాను బిడ్డను కోల్పోయినట్లు తెలుపుతూ ఓ ఎమోషనల్ వీడియోను కూడా షేర్ చేసింది. నటనకు దూరం అయిన సమీరా ఓ యూట్యూబ్ చానల్(YouTube channel) పెట్టి పలు వ్లాగ్స్ చేస్తుంది. తాజాగా, ఈ అమ్మడు గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను తల్లి కాబోతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘గత సంవత్సరం, నేను హృదయ విదారకమైన నష్టాన్ని చవి చూశాను. అది నన్ను విచ్ఛిన్నం చేసింది. కానీ మేము ఉమ్రా సమయంలో పవిత్ర కాబాను సందర్శించినప్పుడు అల్లాహ్‌ను కోరుతూ ప్రార్థన చేశాను.

ఆయన ప్రణాళికలను విశ్వసిస్తూ ఆయనపై నమ్మకం ఉంచాను. ఒక సంవత్సరం గడవకముందే, అల్లా నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. మేము ఇప్పుడు మళ్లీ జీవితం బహుమతితో ఆశీర్వదించబడ్డాము. త్వరలో మా చిన్నారిని కలుసుకోబోతున్నాం. అల్లాహ్ మనకు ఏది ఉత్తమమో తెలుసు. సరైన సమయంలో మనలను ఆశీర్వదిస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ వింటూ ఉంటాడు’’ అని రాసుకొచ్చింది. అలాగే జూన్ 4వ తేదీన డెలివరీ డేట్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సమీరాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Next Story