ఇండస్ట్రీలో విషాదం.. ఉరి వేసుకొని నటి ఆత్మహత్య

by Gantepaka Srikanth |

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఇండస్ట్రీలో విషాదం.. ఉరి వేసుకొని నటి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ నటి సుభాషిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సరిగ్గా ఆమె పుట్టినరోజుకు ఆరు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ముందు ఆమె తన భర్తతో గొడవ పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిద్దరి మధ్య కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీలంకకు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివసిస్తూ ఉండేది. అయితే, షూటింగ్‌ల కారణంగా చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ వచ్చింది. “కయల్” అనే టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆమె, సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అనూహ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Next Story