సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎంతో మంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎంతో మంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. నటనకు కాస్త గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరైతే పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు గుడ్ బై చెబుతున్నారు. ఇంకా కొందరు మాత్రం రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ బుల్లితెర నటి పెళ్లి చేసుకుంది. కన్నడ బ్యూటీ మాన్సి జోషి(Mansi Joshi) దేవత సీరియల్‌లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

అలాగే పారు, రాధ రమణ(Radha Ramana), అంబుదాన్ ఖుషి, రాధ రాఘవ, గీతాంజలి (Geetanjali)వంటి వాటిల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ అమ్మడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాఘవతో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి బెంగళూరులోని ఫంక్షన్ హాల్‌లో జరగ్గా సన్నిహితులు, బంధుమిత్రులు ఈవేడుకకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇక తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మానసి ఇన్‌స్టా ద్వారా షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మాన్సి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అవి చూసిన సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story