- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను నమ్మండి ఉత్తమమైనదాన్ని అందిస్తానని హామీ ఇస్తున్నాను.. రష్మిక ఆసక్తికర ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస హిట్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస హిట్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం కుబేర(Kubera), ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై థీరజ్, అల్లు అరవింద్(Allu Aravind) నిర్మిస్తున్నారు. అయితే విభిన్న ప్రేమ కథతో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి కొద్ది కాలంగా అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, రష్మిక ట్విట్టర్ ద్వారా స్పందించింది.
‘‘మేము మిమ్మల్ని వెయిట్ చేస్తున్నామని నాకు తెలుసు. మీ ట్రెండ్ నిజంగా వేరే విషయం.. కానీ నన్ను నమ్మండి. రాహుల్ రవీంద్రన్ మీకు ఉత్తమ అవుట్‌పుట్ ఇవ్వడానికి నిజంగా కృషి చేస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన చిత్రాలలో ఒకటి. మనం సాధారణంగా ఎక్కువగా మాట్లాడని విషయాల గురించి మాట్లాడే సినిమా ఇది. స్వచ్ఛమైన పాత్రల ఆధారంగా నడిచే చిత్రం. మేము మీకు ఉత్తమమైనదాన్ని అందించాలనుకుంటున్నామని. మీకు హామీ ఇస్తున్నాము. అది మీకు విలువైనదిగా ఉంటుంది. మీరు మాకు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. మేము ప్రక్రియను వేగవంతం చేసి మీకు త్వరలో అప్డేట్ అందిస్తాము’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






