ట్రంప్ మరో బాంబు .. భారతీయ చిత్రాలకు భారీ దెబ్బ?

by velandi.Saikiran |

అమెరికా ( America) అధ్యక్ష పదవి దక్కిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump).. అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. స

ట్రంప్ మరో బాంబు .. భారతీయ చిత్రాలకు భారీ దెబ్బ?
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా ( America) అధ్యక్ష పదవి దక్కిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump).. అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. సుంకాలు పెంచేసి... ఆర్థికంగా దేశాలన్నీ నష్టపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు ఒకలా... గెలిచిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా వస్తువులపై సుంకాలు విధించిన... డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమపై పడిపోయారు. అమెరికాలో షూటింగ్ జరుగని, విదేశాలలో నిర్మించిన సినిమాలపై ఏకంగా 100% సుంకం విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసి..షాక్ ఇచ్చారు ట్రంప్.

అమెరికా దేశంలోని సినీ పరిశ్రమను రక్షించుకునేందుకు... ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఇది అమెరికా జాతీయ భద్రత అంశం అని కూడా ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో.... ముఖ్యంగా ఇండియన్ సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న తెలుగు చిత్రాల విడుదల వ్యయం రెట్టింపు అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. టికెట్ ధరలు విపరీతంగా పెరిగి, బాక్స్ ఆఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా చిన్న అలాగే మధ్యతరహాలో తీసిన తెలుగు సినిమాలు ఇకపైన అమెరికాలో విడుదల చేయాలంటే... పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. అంతేకాదు చాలా సినిమాలు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫెయిల్యూర్ అయి... అమెరికాలో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టగలిగేవి. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చిన్న సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ.. సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ... అమెరికాలో టికెట్ల ధరలను పెంచి, ఆ భారం ప్రేక్షకులపై మోపి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే.. థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోతారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రమాదంలో పడిందని చెబుతున్నారు.

Next Story