- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Family: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. ఇల్లు ధ్వంసం చేశాడని అన్నపై తమ్ముడి ఫిర్యాదు
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్‌లో ఒకటైన మంచు కుటుంబంలో (Manchu Family) అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్‌లో ఒకటైన మంచు కుటుంబంలో (Manchu Family) అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు దాడులు చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా మరోసారి వీరి మధ్య విభేదాలు భగ్గమన్నాయి. తాము ఇంట్లో లేని సమయంలో తన ఇల్లును ధ్వంసం చేశారని అన్న మంచు విష్ణుపై (Manchu Vishnu) తమ్ముడు మంచు మనోజ్ (Manchu Manoj) మంగళవారం నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
తన కూతురు దేవసేన (Devasena) పుట్టిన రోజు సందర్భంగా రాజస్థాన్ వెళ్లగా, జల్‌పల్లి (Jalpally) ఇంట్లోకి 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని విలువైన వస్తువులతోపాటు కార్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. అవన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని ఆరోపించారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా, తను అందుబాటులోకి రాలేదని అందుకే ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి మనోజ్ ఫిర్యాదుపై మంచు విష్ణు స్పందిస్తాడా లేదా చూడాలి.
కాగా, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొన్నాళ్ల క్రితమే భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పాప పుట్టగా ఈ చిన్నారికి దేవసేన అని పేరు పెట్టారు. తాజాగా దేవసేన మొదటి పుట్టిన రోజుని రాజస్థాన్‌లోని జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.






