Urvashi Rautela: ఊర్వశీపై దారుణమైన ట్రోల్స్.. మీకు విజ్ఞప్తి అంటూ టీమ్ క్లారిటీ

by Chukka Sudharani |

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela).. ఇటీవల ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది

Urvashi Rautela: ఊర్వశీపై దారుణమైన ట్రోల్స్.. మీకు విజ్ఞప్తి అంటూ టీమ్ క్లారిటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela).. ఇటీవల ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ సినిమాలో ‘దబిడి దిబిడి’ అనే ఐటెమ్ సాంగ్‌లో మాస్ స్టెప్పులు వేసి యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. అయితే.. ఊర్వశీ ప్రజెంట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ‘నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు వెళ్తే ఎవరైనా వెళితే నా ఆలయాన్ని సందర్శించండి’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఊర్వశీపై నెట్టింట్ ట్రోల్స్ (Trolls) స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వార్తలపై బాలీవుడ్ (Bollywood) నటి ఊర్వశీ టీమ్ స్పందించారు. ‘ఊర్వశీ తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారు. అది తన కోసం కట్టిన గుడి అని చెప్పలేదు. అందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.. దయచేసి మరోసారి ఆ వీడియో క్లారిటీగా వినండి. నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందును నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలాగే వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story