పవన్ కల్యాణ్ సినిమాకు వింత పరిస్థితి.. తట్టుకోలేపోతున్న అభిమానులు!

by Gantepaka Srikanth |

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ కల్యాణ్ సినిమాకు వింత పరిస్థితి.. తట్టుకోలేపోతున్న అభిమానులు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల ఉందంటే.. అగ్ర హీరోలైనా సరే వారి సినిమాలను వాయిదా వేసుకునే రోజులు ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మొత్తం రివర్స్ అయ్యాయి. ఓ ఓటీటీ సంస్థ పవన్ కల్యాణ్ సినిమా(Hari Hara Veera Mallu) విడుదల తేదీని డిసైడ్ చేసే రోజులు వచ్చాయని సోషల్ మీడియాలో పవన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు.. వాయిదా పడిన నాటి నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ‘జూన్ 11న విడుదల అన్నారు.. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. చివరకు మళ్లీ వాయిదా వేశారు. జూన్ నెల ముగియవస్తున్నా.. ఇంకా కొత్త తేదీ ప్రకటించలేదు. కనీసం జులైలో అయినా విడుదల ఉంటుందా? లేక ఆగష్టు వరకూ ఆగాల్సిందేనా?’ అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ రిలీజ్ డేట్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. చివరకు ఎలాంటి అప్డేట్ లేదని తెలియడంతో నిర్మాణ సంస్థను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల సినిమా లేట్ అయిందని అనుకున్నాం.. కానీ మీ నిర్లక్ష్యం వల్లే లేట్ అవుతోందని మండిపడుతున్నారు. సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని డిమాండ్స్ చేస్తున్నారు. ట్వీట్

Next Story