Kannappa : కన్నప్ప సినిమాపై దారుణమైన ట్రోల్స్.. మరోసారి స్పందించిన చిత్ర బృందం.. నోట్ రిలీజ్

by Chukka Sudharani |

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa)

Kannappa : కన్నప్ప సినిమాపై దారుణమైన ట్రోల్స్.. మరోసారి స్పందించిన చిత్ర బృందం.. నోట్ రిలీజ్
X

దిశ, సినిమా: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 1న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. దీనిపై విష్ణు క్లారిటీ ఇస్తూ.. సినిమా షూటింగ్‌కు సంబంధించి VFX పని పూర్తి కాలేదు. రిలీజ్‌కు కొంత సమయం పడుతుంది. ఆలస్యం అవుతున్నందుకు ఫ్యాన్స్ మమ్మల్ని క్షమించాలి అంటూ ఓ నోట్ కూడా రిలీజ్ చేశాడు. అయితే.. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో కన్నప్ప ప్రీమియర్ షో (premiere show) వేసినట్టు విష్ణు అండ్ మోహన్ బాబుకి ఆ సినిమా నచ్చకపోవడం డల్‌గా లోపల నుంచి బయటకు వస్తున్నట్లు చూపించారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. VFX పని పూర్తి కాలేదని చెప్పి ప్రిమియర్ షో ఎలా వేశారని కొందరు.. సినిమా పోయినట్లేనా అంటూ మరుకొందరు నెట్టింట నెగిటివ్‌గా ట్రోల్స్ (Negative trolls) చేస్తున్నారు. దీనిపై తాజాగా ‘కన్నప్ప’ టీమ్ మరోసారి స్పందించింది.

‘మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్‌ వేశారంటూ ఆన్‌లైన్‌ వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. వీఎఫ్‌ఎక్స్‌ విభాగానికి సంబంధించి 15 నిమిషాల ఫుటేజ్‌ నాణ్యతను సమీక్షించాం. ‘కన్నప్ప’ ఫస్ట్‌ కాపీ(First copy)ని సిద్ధం చేసే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ సినిమా విస్తృతమైన వీఎఫ్‌ఎక్స్‌ (Extensive VFX) పరిధి కలిగి ఉండటం, ప్రతి ఫ్రేమ్‌ సమగ్రంగా తీర్చిదిద్దుతుండటంతో మరింత సమయం అవసరమైంది. అభిమానులు, మీడియా ధ్రువీకరించని ఇలాంటి వార్తలు, సమాచారాన్ని నమ్మొద్దు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘కన్నప్ప’ టీమ్‌ కష్టాన్ని అర్థం చేసుకుంటూ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అని కన్నప్ప టీమ్ పేర్కొంది.

Next Story