- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా..? మీసాలపిల్ల పాటపై దారుణమైన ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా సుస్మిత కొనిదెల, సాహు గరికపాటి నిర్మిస్తున్నారు. బీమ్స్ సిసిలిరియో ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా సుస్మిత కొనిదెల, సాహు గరికపాటి నిర్మిస్తున్నారు. బీమ్స్ సిసిలిరియో ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి మీసాలపిల్ల ఫుల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట ప్రోమో విడుదల చేసినప్పుడు ట్రోల్స్ రాగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి. చిరు ముఖంలో అసలు ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా లేవని, నయనతార చిరంజీవి మధ్యన కెమిస్ట్రీ సైతం సెట్ కాలేదని ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమాలోని కాత్యాయని ఫోన్ చేయవే పాటను చిరంజీవి పాటకు జోడించి.. ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా.. అంటూ మీమ్స్, వీడియోలు చేస్తున్నారు. చిరంజీవి ఇకపై రొమాంటిక్ సినిమాలకు దూరంగా ఉండాలని వయసుకు తగ్గ సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే పాట ఎలా ఉన్నా అనిల్ రావిపూడి హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించగా మెగాస్టార్ హిట్ కొట్టడం పక్కా అని డిసైడ్ అయ్యారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వీడియో
READ MORE ....
‘మెగా-158’ లో హీరోయిన్ ఫిక్స్.. మెగాస్టార్ సరసన బంపర్ ఆఫర్ అందుకున్న మలయాళ బ్యూటీ..






