- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ALLU SHIRISH: అంతా బాగుంది కానీ ఆ ఒక్కటే.. అల్లు శిరీష్‌పై నెట్టింట దారుణమైన ట్రోల్స్
టాలీవుడ్ హీరో, అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. తన ప్రియురాలు నయనికతో శిరీష్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అతడి గెటప్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో, అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. తన ప్రియురాలు నయనికతో శిరీష్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అతడి గెటప్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా మహిళలు మాత్రమే మెడలో నెక్లెస్ లు వేసుకుంటారు. కానీ అల్లు శిరీష్ మెడలో ఓ డైమండ్ నెక్లెసె వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో అంతా బాగుందని కానీ మెడలో నెక్లెస్ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఫోటోలు బాగున్నాయని కానీ శిరీష్ మెడలో నెక్లెస్ వేసుకోవడం బాగాలేదని చెబుతున్నారు. మరోవైపు శిరీష్ ఫోటోలపై సైతం ఇన్ స్టాలో మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి. అయితే అల్లు శిరీష్ ధరించింది విక్టోరియన్ డైమండ్ నెక్లెస్ అని తెలుస్తోంది. దీని ధర 10వేల డాలర్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే అల్లు శిరీష్ బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు వరుస పెట్టి సినిమాలు చేసినా ఆశించిన విజయం దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.






