పుష్ప-2 సినిమా విడుదల వేళ హీరో అల్లు అర్జున్ పై ట్రోల్స్.. ఎందుకంటే..?

by Malleboina Mahesh |   (  Updated:2025-08-03 11:00:58  IST  )

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది.

పుష్ప-2 సినిమా విడుదల వేళ హీరో అల్లు అర్జున్ పై ట్రోల్స్.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమా‌కు ఎంతో హైప్ ఉంది. ఈ క్రమంలో విడుదలైన పాటలు, ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల సిద్ధం అయింది. ఇప్పటికే సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న క్రమంలో హీరో అల్లు అర్జున విడుదల చేసిన ఓ మీడియా పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు.. చెడు అలవాట్లపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన స్టార్ హీరోల సినిమాల్లో ఆ వీడియోను ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరో అల్లు అర్జున్ కూడా తన వంతు బాధ్యతగా.. చిన్నపాటి మెసేజ్ ఉన్న వీడియోను అప్లోడ్ చేశారు. అందులో డ్రగ్స్ కు బానిసగా మారిన వారిని చూస్తే.. వెంటనే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి.. చెప్పాలని హీరో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ వీడియోకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని మన పిల్లలు, యువతను డ్రగ్స్ నుండి రక్షించడానికి ప్రజా చైతన్య ప్రచారంలో చేరినందుకు సంతోషంగా ఉందని.. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం మనమందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు.

అయితే ఇక్కడే అల్లు అర్జున్ వీడియో పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. పుష్ప పార్ట్ వన్‌లో.. హీరో అల్లు అర్జున్ ఎర్రచందన స్మగ్లింగ్ చేసే పాత్రలో కనిపించాడని.. పార్ట్-2 లో కూడా అదే కొనసాగిందని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ పాత్రను పోషించిన అల్లు అర్జున్.. ఇప్పుడు డ్రగ్స్ వాడకం పై అవగాహన కల్పిస్తూ వీడియో చేయడం హాస్యాస్పదం అంటూ.. ఆయన వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.. ఇదిలా ఉంటే.. పుష్ప-2 సినిమాకు వస్తున్న ఆదరణ ను జీర్ణించుకోలేక ఇలాంటి కామెంట్లు పెడుతున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

Video Link..

Flash News: భారీగా పుష్ప-2 టికెట్ రేట్లు పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Next Story