- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alia Bhatt: అలా మాట్లాడిన ఆలీయా భట్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
ఇటీవల మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో ఆలియా భట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

దిశ, సినిమా: ఇటీవల మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో ఆలియా భట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో భాగంగానే మీడియాతో ముచ్చటించిన ఆలియా.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ఈ ప్రాజెక్ట్ నా మొదటి యాక్షన్ మూవీ. దీని పట్ల నేను చాలా ఉత్సాహంగా అలాగే కొంత భయం కూడా ఉన్నాను’ అని తెలిపింది. అయితే.. ఈకామెంట్స్ కాస్త వైరల్ కావడంతో ప్రజెంట్ ఈ బ్యూటీ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ‘ఆల్ఫా’ యాక్షన్ చిత్రం అయితే.. ‘రాజీ’, ‘జిగ్రా’ వంటి చిత్రాలను ఏం అంటారు. అందులో కూడా బలమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా.. అలాగే హాలీవుడ్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా.. గత చిత్రాలను పక్కన పెట్టి కేవలం ‘ఆల్ఫా’ ని మాత్రమే నీ ఫస్ట్ యాక్షన్ సినిమా అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నెట్టింట కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. అయితే.. ఆలియా ఫ్యాన్స్ మాత్రం ఇది యాక్షన్ మూవీ అయుంటుంది అందుకే అలా కామెంట్ చేసింది అని సపోర్ట్ చేస్తున్నారు.
- Tags
- alia bhatt






