Irumudi: రవితేజ కొత్త సినిమాపై దారుణంగా ట్రోల్స్..రీమేక్ ఎందుకంటూ ?

by velandi.Saikiran |

రవితేజ హీరోగా వస్తున్న ఇరుముడి సినిమాపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సినిమా మాలికాపురం కు రీమేక్ అటు పోస్టులు పెడుతున్నారు సినిమా ప్రియులు.

Irumudi: రవితేజ కొత్త సినిమాపై దారుణంగా ట్రోల్స్..రీమేక్ ఎందుకంటూ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేసి, ఇరగదీస్తున్నారు. మొన్న సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో సక్సెస్ అందుకున్న రవితేజ, తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమాను ప్రకటించేశాడు. ఇరుముడి (Irumudi ) అనే డిఫరెంట్ టైటిల్ తో రవితేజ వచ్చేసాడు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. ఇందులో రవితేజ హీరోగా చేస్తుండగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా మెరువనున్నారు.

రవితేజ సినిమాపై ట్రోలింగ్

రవితేజ హీరోగా వస్తున్న ఇరుముడి సినిమాపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సినిమా మాలికాపురం కు రీమేక్ అటు పోస్టులు పెడుతున్నారు సినిమా ప్రియులు. ఇప్పటికే ఈ మాలికాపురం సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయింది. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే కథ ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో రవితేజ, ఇలాంటి సినిమాకు ఎందుకు ఓకే చెప్పాడని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే, ఇరుముడి ఏ సినిమాకు రీమేక్ కాదంటూ మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story