ర‌మ్య‌కృష్ణ‌కు ఘోర అవ‌మానం..ఐరెన్ లెగ్ అంటూ ట్రోలింగ్ !

by velandi.Saikiran |

అందరూ ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రీట్ చేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు. తెలుగులో తన మొదటి చిత్రం భలే మిత్రులు.

ర‌మ్య‌కృష్ణ‌కు ఘోర అవ‌మానం..ఐరెన్ లెగ్ అంటూ ట్రోలింగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో సూపర్ రజినీకాంత్, నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి, ఇండస్ట్రీని షేక్ చేశారు రమ్యకృష్ణ. అలాంటి హీరోయిన్ రమ్యకృష్ణను ఐరన్ లెగ్ అని దారుణంగా ట్రోల్లింగ్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ తాజాగా వెల్లడించారు. జగపతిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న జయమ్ము నిశ్చయమ్ము రా అనే షోకు నటి రమ్యకృష్ణ హాజరై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన కెరీర్ ప్రారంభంలోనే అందరూ ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రీట్ చేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు. తెలుగులో తన మొదటి చిత్రం భలే మిత్రులు. ఈ సినిమా సమయంలో తాను నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని గుర్తు చేశారు. దీంతో ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చదువుకోమని ఫోర్స్ చేశారని రమ్యకృష్ణ తెలిపారు. కానీ ఓ జ్యోతిష్కుడు మాత్రం, పెద్ద స్టార్ హీరోయిన్ అవుతావని సూచనలు చేశాడట. దీంతో మళ్లీ యాక్టింగ్ స్కూల్లో చేరి, సక్సెస్ అయినట్లు తెలిపారు. 1984 లో ఇండ‌స్ట్రీలోకి వ‌స్తే, 1991లో స‌క్సెస్ అందుకున్నాన‌ని పేర్కొన్నారు. ఆ త‌ర్వాత వెన‌క్కి చూసుకోలేద‌న్నారు.

Next Story