- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ కొడుకుపై దారుణంగా ట్రోలింగ్..SRHను ఎప్పుడు వదిలేసావ్ అంటూ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) ఛాంపియన్ గా

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో.. ఛాంపియన్ గా బెంగళూరు నిలవడంతో... దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ( Allu Arjun) కుటుంబ సభ్యులు కూడా సెలబ్రేషన్స్ నిన్న రాత్రి చేసుకున్నారు.
బెంగళూరు టైటిల్ గెలవగానే... ఎగిరి గంతేసింది అల్లు అర్జున్ ఫ్యామిలీ. ఇక అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ( Aaayan).. వాటర్ బాటిల్ తో (Water Bottle) తన తలపై నీళ్లు పోసుకుని మరి... ఫుల్ జోష్ లో కనిపించాడు. ఆర్సిబీ ( RCB) చాలా రోజుల తర్వాత టైటిల్ గెలిచిందని... ఎంజాయ్ చేస్తూ సందడి చేశాడు. అయితే ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పంచుకున్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పైన ( Aaayan) సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. గతంలో... సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( SRH) సంబంధించిన జెర్సీని ధరించి... అల్లు అయాన్ కనిపించిన ఫోటోను వైరల్ చేస్తున్నారు. అప్పుడు హైదరాబాద్ కు సపోర్ట్ చేసి... ఎప్పుడు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యావు అంటూ ఆ కుర్రాడిపై సెటైర్లు పేల్చుతున్నారు. అప్పటి ఫోటోను అలాగే ఇప్పటి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు.
RCB ki eppudu shift kottav ayya 🤣 https://t.co/6XDqZGVn91 pic.twitter.com/5TAOcdsyMl
— 🏏 (@NaaniHolic) June 4, 2025






