నివేదా పెతురాజ్‌తో పెద్ద ప్లాన్ వేసిన త్రివిక్రమ్

by Pulgam srinivas |

ఆదర్శ కుటుంబం AK47 మూవీలో నివేదా ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

నివేదా పెతురాజ్‌తో పెద్ద ప్లాన్ వేసిన త్రివిక్రమ్
X

దిశ, వెబ్ డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం AK47’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పెతురాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నివేదా పెతురాజ్ పాత్రకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో ఆమె కేవలం ముఖ్యమైన పాత్రలో మాత్రమే కాకుండా, ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో కూడా కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో నివేదా పెతురాజ్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె ఒక పాటలో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈసారి కూడా ఆమె కేవలం పాటలో కాసేపు కనిపిస్తుందా? లేక పూర్తి స్థాయి స్పెషల్ సాంగ్‌లో సందడి చేస్తుందా? అనే అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story