నా కుక్కకు మాత్రమే అనుమతి.. తనపై వస్తున్న ట్రోల్స్‌పై త్రిష రియాక్షన్

by Chukka Sudharani |   (  Updated:2026-06-02 15:25:29  IST  )

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ హీరోయిన్‌గా పాత్రలు అందుకుంటూ అలరిస్తున్న నటి త్రిష.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మోస్ట్ ట్రెండింగ్ వార్తల్లో ఒకటిగా నిలిచింది.

నా కుక్కకు మాత్రమే అనుమతి.. తనపై వస్తున్న ట్రోల్స్‌పై త్రిష రియాక్షన్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ హీరోయిన్‌గా పాత్రలు అందుకుంటూ అలరిస్తున్న నటి త్రిష.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మోస్ట్ ట్రెండింగ్ వార్తల్లో ఒకటిగా నిలిచింది. తమిళనాడు సీఎం విజయ్‌తో త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలు కొన్ని రోజులుగా సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ రూమర్స్‌పై ఎప్పుడు విజయ్ కానీ, త్రిష కానీ స్పందించలేదు. అయితే.. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలపై వచ్చే తప్పుడు వార్తలు, ట్రోలింగ్స్‌పై ఎప్పుడు స్పందించని త్రిష.. తాజాగా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ మాత్రం షాకింగ్‌గా వైరల్ అవుతున్నది. ఈ మేరకు తన పెంపుడు కుక్క ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా స్టోరీ పెట్టిన ఆమె.. ‘నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను’ అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. డైరెక్ట్‌గా ఎవరి పేరు ప్రస్తావించకుండా.. నా లైఫ్‌లో నా కుక్క తప్పా ఎవరు లేరనే హింట్ ఇచ్చింది ఈ బ్యూటీ. దీంతో తనపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందని భావిస్తున్నారు నెటిజన్లు.

Next Story