- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trisha: తెలుగులో విడుదలకు సిద్ధమైన త్రిష బ్లాక్ బస్టర్ చిత్రం..
టాలీవుడ్ (Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష (Trisha).. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second innings)లోనూ తన సత్తా చాటుకుంటోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ (Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష (Trisha).. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second innings)లోనూ తన సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. త్వరలో ‘విడాముయర్చి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు ‘ఐడెంటిటీ’ (Identity) అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. టొవినో థామస్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించారు.
ఈ ఏడాది జనవరి-2న రిలీజైన ఈ చిత్రం మలయాళం (Malayalam)లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రాన్ని నైజాంలో శ్రీ వేదాక్షర మూవీస్ వారు జనవరి 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఐడెంటిటీ’ చిత్రం తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.






