Trisha: అలాంటి వార్తల వల్ల నా ఇమేజ్ దెబ్బతింటుంది.. త్రిష షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది సీనియర్ హీరోయిన్ త్రిష.

Trisha: అలాంటి వార్తల వల్ల నా ఇమేజ్ దెబ్బతింటుంది.. త్రిష షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది సీనియర్ హీరోయిన్ త్రిష. 40 ఏళ్లు వచ్చిన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా.. ఎవర్‌గ్రీన్‌గా మెరిసిపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తన పర్శనల్‌కి సంబంధించిన పుకార్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది త్రిష. ఇండస్ట్రీలో కొంత మంది హీరోలతో త్రిష రిలేషన్‌లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి.

రీసెంట్‌గా ఈ వార్తలు మరోసారి ఊపందుకోవడంతో.. తాజాగా ఈ ఫేక్ న్యూస్‌పై త్రిష స్ట్రాంగ్‌గా స్పందించినట్లు తెలుస్తుంది. ‘ఇండస్ట్రీలో చాలా మందితో నాకు స్నేహం మాత్రమే ఉంది. అయితే.. వారందరిని మీడియా నా భర్తలుగా చూపించడం చాలా తప్పు. స్నేహితులతో ఉన్న ఫొటోలను చూసి పెళ్లి వార్తలు రాయడం అసహ్యం వేస్తుంది. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం ఆపండి. వ్యక్తిగత విషయాలపై ఇలా రూమర్స్ సృష్టించడం వల్ల నా ఇమేజ్ దెబ్బతింటుంది.. ప్రజెంట్ నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది’ అని సీరియస్ అయిందట త్రిష.

Next Story