మ్యాజికల్ మే అంటూ త్రిష పోస్ట్.. రిలేషన్‌షిప్ నిజమేనంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

తాను ఎంతో ఇష్టపడే ‘మ్యాజికల్ మే’ నెలలో జరిగిన తన బర్త్‌డే వేడుకలు, ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె కొన్ని క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

మ్యాజికల్ మే అంటూ త్రిష పోస్ట్.. రిలేషన్‌షిప్ నిజమేనంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్‌గా అలరిస్తున్న అందాల భామ త్రిష కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్ కార్యక్రమానికి హాజరైన కొద్ది రోజులకే త్రిష ఈ పోస్ట్ పెట్టడం విశేషం. తాను ఎంతో ఇష్టపడే ‘మ్యాజికల్ మే’ నెలలో జరిగిన తన బర్త్‌డే వేడుకలు, ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె కొన్ని క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. మే 4న పుట్టినరోజు జరుపుకున్న త్రిష.. తన పెంపుడు కుక్క ‘ఇజ్జీ’తో దిగిన క్యాండిడ్ ఫోటోలు, పూల డిజైన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిర్రర్ సెల్ఫీ, దేవుడి ప్రార్థనల డైరీ, అలాగే ఎలాంటి మేకప్ లేకుండా సహజంగా ఉన్న స్నాప్స్‌ను ఇందులో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలతో పాటు ఆమె షేర్ చేసిన ఒక కొటేషన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

"40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడం గొప్ప కాదు.. 20 ఏళ్ల వయసులో ఉన్న యువతులు 40 ఏళ్ల ప్రాయాన్ని చూసి భయపడకుండా, ఆ వయసు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేయడమే నా లక్ష్యం" అంటూ త్రిష రాసుకొచ్చారు. ఈ జ్ఞాపకాలు తనను జీవితాంతం నవ్విస్తూనే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. దీంతో అది చూసిన వారంతా విజయ్ సీఎం అవ్వడంతో మ్యాజికల్ మే అని క్యాప్షన్ పెట్టిందని చర్చించుకుంటున్నారు. వీరి రిలేషన్‌పై ఈ పోస్ట్‌తో హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా త్రిష, విజయ్ వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించకపోయినప్పటికీ, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాక వీరి గురించిన చర్చ మరింత ఎక్కువైంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి వెళ్లిన వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ఇటీవల అజిత్ కుమార్ తల్లి చనిపోగా.. ఆమెకు నివాళి అర్పించేందుకు కూడా త్రిష, విజయ్ ఒకే కారులో రావడం గమనార్హం. ఇలా నిత్యం కలిసి ప్రయాణిస్తున్న వీరిద్దరు తమ బంధంపై ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

Next Story