Trisha: స్టార్ హీరోతో మితిమీరిన రొమాన్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-21 12:08:35  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(trisha) ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Trisha: స్టార్ హీరోతో మితిమీరిన రొమాన్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(trisha) ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి వంటి చిత్రాల్లో నటించిన ఆమె విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) సరసన ‘థగ్‌లైఫ్’ (Thug life)సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మణిరత్నం(Maniratnam) తెరకెక్కిస్తుండగా.. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ఫీ జెయింట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో శింబు, ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్(Joju George), దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రలో కనిపించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్‌లో థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా, థగ్‌లైఫ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న త్రిష షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో కమల్ హాసన్‌తో రొమాన్స్ చేయడంపై యాంకర్ ప్రశ్నించగా.. త్రిష స్పందిస్తూ ‘‘నేను ఇంతకు ముందు వారితో వ్యక్తిగతంగా పనిచేశాను. కానీ కమల్ హాసన్ సర్, మణిరత్నం సర్ లను సెట్‌లో కలిసి చూడాలనుకున్నాను. ఈ సమయంలోనే ‘థగ్‌లైఫ్’ చిత్రం ఆఫర్ వచ్చింది. ఈ సినిమా వీరిద్దరి కాంబోలో వస్తుందని తెలిసి ఆలోచించకుండా వెంటనే ఒకే చేశాను’’ అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అవి చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం తండ్రి వయసున్న హీరోతో రొమాన్స్ చేయమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో నటిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. సోసియో ఫాంటసీ చిత్రంగా రాబోతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story