ఆ ముగ్గురు స్టార్స్‌కు లక్కీ చార్మ్‌గా మారిన త్రిష

by Mallepaka Hamsa |

ఈ హీరోలందరి కెరీర్ మైల్‌స్టోన్ బ్లాక్‌బస్టర్ విజయాల వెనుక లక్కీ చార్మ్ త్రిష మ్యాజిక్ ఉంది.

ఆ ముగ్గురు స్టార్స్‌కు లక్కీ చార్మ్‌గా మారిన త్రిష
X

దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా ఓ సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుని వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు టాప్ స్టార్ హీరోలు.. విజయ్, అజిత్ కుమార్, సూర్యల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో త్రిషనే హీరోయిన్‌గా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక అజిత్ కుమార్ హీరోగా వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కూడా అజిత్ కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇటీవల సూర్య హీరోగా విడుదలైన చారిత్రాత్మక చిత్రం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ సినిమాల్లో త్రిషనే హీరోయిన్ కావడంపై ఒక నెటిజన్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. "ఈ హీరోలందరి కెరీర్ మైల్‌స్టోన్ బ్లాక్‌బస్టర్ విజయాల వెనుక లక్కీ చార్మ్ త్రిష మ్యాజిక్ ఉంది" అంటూ సదరు అభిమాని ట్వీట్ చేశారు. ఈ విషయంపై త్రిష ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ హార్ట్ ఎమోజీలను జత చేయడమే కాకుండా థాంక్స్ చెప్పారు. త్రిష కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతోందని అంతా చర్చించుకుంటున్నారు.

Next Story