- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీ సినిమాతో రాబోతున్న త్రిప్తి.. కీలక పాత్రలో స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హిందీలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హిందీలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’ (Animal)సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ మూవీ 2023లో సూపర్ హిట్‌గా నిలవడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక గత ఏడాది ‘భూల్ భూలయ్యా-3’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ధడక్-2’(Dhadak-2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, త్రిప్తి డిమ్రి ఓ ఓటీటీ సినిమాకు ఒకే చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సురేష్ త్రివేణి(Suresh Triveni) దర్శకత్వంలో రాబోతున్న కామెడీ డ్రామాలో త్రిప్తి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే తల్లి కూతురు బంధంతో పాటు కామెడీ చిత్రంగా రాబోతుండగా.. దీనికి ‘తల్లి అవడం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్(Madhuri Dixit) త్రిప్తి తల్లిగా నటిస్తుండగా.. రవి కిషన్, ధర్నా దుర్గా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల ముంబైలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.






