- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 కోట్ల ఆస్తులు..కానీ ర్యాపిడో బైక్ పై వెళ్తున్న హాట్ బ్యూటీ ?
30 కోట్ల ఆస్తులు ఉన్నాయి... అయినా కూడా సాధారణ బైక్ పైన ఓ హాట్ బ్యూటీ వెళ్ళింది. రాపిడో బైక్ ( Rapido Bike) బుక్ చేసుకొని

దిశ, వెబ్ డెస్క్: 30 కోట్ల ఆస్తులు ఉన్నాయి... అయినా కూడా సాధారణ బైక్ పైన ఓ హాట్ బ్యూటీ వెళ్ళింది. రాపిడో బైక్ ( Rapido Bike) బుక్ చేసుకొని మరి... సాధారణ పౌరులు... వెళ్లినట్టే తన గమ్యస్థానానికి వెళ్ళింది ఈ హీరోయిన్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 30 కోట్ల ఆస్తులు ఉన్నా.. రాపిడో బైక్ పైన వెళ్లిన హాట్ బ్యూటీ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు యానిమల్ సినిమా బ్యూటీ తృప్తి డిమ్రి ( Tripti Dimri ). ఈ హాట్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యానిమల్ సినిమా ( Animal movie ) ద్వారా... ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తృప్తి డిమ్రి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ... మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika) కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ యానిమల్ సినిమాలో రణబీర్ ( Ranbir Kapoor ) సరసన నటించి... అతనితో ఘాటుగా రొమాన్స్ చేసింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడం... ఈ అందాల తారకు మంచి మార్కులు పడడంతో... అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఛాన్సులు వస్తున్నాయి. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ సినిమాలలో అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి ఈ బ్యూటీ ఆస్తులు 30 కోట్లుగా ఉన్నాయట. ఒక్కో సినిమాకు ఈ అందాల తార మూడు కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఒక సోషల్ మీడియా పోస్టుకు 80 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ... తాజాగా రాపిడో బైక్ పైన వెళ్ళింది తృప్తి డిమ్రి. ముంబైలో... తన పర్సనల్ వర్క్ కోసం బైక్ బుక్ చేసుకొని మరి వెళ్ళింది. అయితే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.... రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. కోట్ల ఆస్తులు ఉన్న హీరోయిన్ తృప్తి డిమ్రి సింప్లిసిటీ బాగుందని అంటున్నారు. ఆమెను సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.






