tripti_dimri: బ్లాక్ డ్రెస్‌లో తెలుపు అందాల్ని వలకబోస్తోన్న బోల్డ్ బ్యూటీ

by Kodari Anjali |   (  Updated:2025-08-11 15:03:46  IST  )

2017 లో పోస్టర్ బాయ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ త్రిప్తి డిమ్రి. తర్వాత రొమాంటిక్ డ్రామాగా వచ్చిన లైలా మజ్ను లో ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

tripti_dimri: బ్లాక్ డ్రెస్‌లో తెలుపు అందాల్ని వలకబోస్తోన్న బోల్డ్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2017 లో పోస్టర్ బాయ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ త్రిప్తి డిమ్రి. తర్వాత రొమాంటిక్ డ్రామాగా వచ్చిన లైలా మజ్ను లో ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. త్రిప్తి 202 లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే యువతను పిచ్చోళ్లను చేసింది. బోల్డ్ గా దర్శనమిచ్చి కుర్రాళ్ల హార్ట్ కొల్లగొట్టింది. తర్వాత సినిమా అవకాశాలు తక్కువ వచ్చినప్పటికీ.. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అంతేకాకుండా ఈ ముద్దుగుమ్ము ఒక్కో చిత్రానికి 40 నుంచి 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సోషల్ మీడియా టాక్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో బ్రాండ్ పోస్ట్‌కు దాదాపు 60 నుంచి 90 వేల రూపాయలు అందుకుంటుందట. అంతేకాకుండా.. త్రిప్తి డిమ్రికి దాదాపు ఇరవై, ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని జనాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో తెలుపు అందాల్ని ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఆగం చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫొటో షూట్‌ను బ్యూటీ అభిమానులతో పంచుకోగా.. నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.

Next Story