- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Spirit : ప్రభాస్ 'స్పిరిట్'లో త్రిప్తి దిమ్రి ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్లో రాబోతున్న సినిమా "స్పిరిట్"(Spirit).

దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్లో రాబోతున్న సినిమా "స్పిరిట్"(Spirit). ఈ సినిమాలో హీరోయిన గా 'యానిమల్'(Animal) బ్యూటీ త్రిప్తి దిమ్రి(Tripti Dimri) ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే తొలుత ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె(Deepika Padukone)ను ఎంపిక చేశారు. అయితే దీపికా పెట్టిన సవాలక్ష కండిషన్స్ తో విసిగిపోయిన చిత్ర యూనిట్ ఆమెను సినిమా నుంచి తప్పించారు.
దీంతో పలువురి హీరోయిన్ల పేర్లు తెర మీదికి వచ్చినా.. చివరికి యానిమల్ లో కీలక పాత్ర పోషించిన త్రిప్తినే ఈ సినిమా కోసం ఎంపిక చేసింది స్పిరిట్ యూనిట్. కాగా ఈ సినిమాను 9 భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్రిప్తి దిమ్రి ఎంపికను తొమ్మిది భాషల్లో రాసి విడుదల చేసిన పోస్టర్లో బయట పెట్టారు సందీప్ రెడ్డి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.






