త్రిప్తి డిమ్రీపై ఎటాక్..

by Sujitha Rachapalli |

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీ ఫస్ట్ పోస్టర్‌కు స్ట్రాంగ్ రెస్పాన్స్ వస్తోంది.

త్రిప్తి డిమ్రీపై ఎటాక్..
X

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీ ఫస్ట్ పోస్టర్‌కు స్ట్రాంగ్ రెస్పాన్స్ వస్తోంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి ఫస్ట్ మిడ్ నైట్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా ఇందులో ప్రభాస్ ఒళ్లంతా గాయాలతో ఓ చేతిలో మందు బాటిల్ పట్టుకుని.. హీరోయిన్ త్రిప్తి డిమ్రీ సిగరెట్ వెలిగిస్తుండగా.. ఇంటెన్స్‌గా కనిపించాడు. ఈ ఆజానుబాహుడు ఫొటో అభిమానులకు కిక్కు ఇచ్చింది కానీ కొందరు మాత్రం త్రిప్తి పాత్రపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ‘యానిమల్’ సినిమాలో మాదిరిగా ఉందని.. ఈ టైప్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ.. ఆడాళ్లపై వివక్ష, న్యూడిటీ, నెగెటివ్ ఇమేజ్‌ను ప్రోత్సహిస్తుందని విమర్శిస్తున్నారు. కానీ మరి కొందరు మాత్రం ఈ ఒక్క పోస్టర్‌తో దీపికా పదుకొణే రిజెక్ట్ చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడేలా చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఫిదా అయిపోతున్నారు.

Next Story