ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి.. భారతీయ సినీ దిగ్గజాలకు అకాడమీ నీరాజనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-16 09:27:30  IST  )

98వ ఆస్కార్ అవార్డుల వేదికపై తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్‌లకు కూడా అకాడమీ నివాళులర్పించింది.

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి.. భారతీయ సినీ దిగ్గజాలకు అకాడమీ నీరాజనం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినీకళామ తల్లి మెరిసింది. 98వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా గతేడాది లోకం విడిచి వెళ్లిన చేసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ప్రత్యేక విభాగంలో తెలుగు వెండితెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)కు చోటు లభించింది. ఈ గౌరవం పొందిన నలుగురు భారతీయ తారలలో కోట ఒకరు కావడం విశేషం. అకాడమీ స్మరించుకున్న భారతీయ తారల్లో మొదటగా కోట శ్రీనివాస రావు ఉన్నారు. అయన మొత్తం తొమ్మిది నంది అవార్డులతో పాటు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. కోట శ్రీనివాసరావు 2025, జూలై 13 కన్నుమూయగా ఆయన దశాబ్దాల సినీ ప్రయాణాన్ని గుర్తిస్తూ అకాడమీ నివాళులర్పించింది. అదేవిధంగా బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra), కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన సీనియర్ నటి సరోజాదేవి (Saroja Devi), తన చిత్రాల ద్వారా దేశభక్తిని చాటిన మనోజ్ కుమార్‌ (Manoj Kumar)‌లను అకాడమీ స్మరించుకుంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యేక గుర్తింపు..

ప్రధాన వేడుక ప్రసారంలో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ తారల పేర్లు ప్రస్తావనకు రాగా.. అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లోని ‘ఇన్ మెమోరియం’ గ్యాలరీలో వీరి చిత్రాలను ప్రదర్శించి వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. వీరితో పాటు బంగ్లాదేశ్ నటి జయశ్రీ కబీర్, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ ఎస్.కృష్ణస్వామిలకు కూడా అకాడమీ నివాళులర్పించింది.

Next Story