- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Satyaraj: రిలీజ్‌కు సిద్ధమైన కట్టప్ప మూవీ..
కట్టప్ప పాత్రలో నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకున్న నటుడు సత్యరాజ్ (Satyaraj) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’

దిశ, సినిమా: కట్టప్ప పాత్రలో నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకున్న నటుడు సత్యరాజ్ (Satyaraj) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbari). స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి (Vijaypal Reddy) నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగా రీచ్ అయ్యాయి. అంతే కాకుండా.. ‘అనగా అనగా కథలా’ అనే పాటతో సత్య రాజ్ ఎమోషనల్‌గా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్‌తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘త్రిబాణధారి బార్బరిక్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఓ మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే సరైన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చెప్పుకొచ్చారు టీమ్.






