చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటిసారి.. హీరోయిన్‌గా ట్రాన్స్‌జెండర్

by Chukka Sudharani |   (  Updated:2026-06-19 15:31:51  IST  )

సమాజంలో ఎన్నో ఆటుపోట్లు, వివక్షను ఎదుర్కొని, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా ఒక లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది ట్రాన్స్ ఉమెన్ హిమా రాథోడ్.

చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటిసారి.. హీరోయిన్‌గా ట్రాన్స్‌జెండర్
X

దిశ, సినిమా: సమాజంలో ఎన్నో ఆటుపోట్లు, వివక్షను ఎదుర్కొని, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా ఒక లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది ట్రాన్స్ ఉమెన్ హిమా రాథోడ్. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘లీగల్ బ్యాటిల్’ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా ‘దిశ’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రియల్ లైఫ్ స్ట్రగుల్స్‌తో పాటు సినిమా విశేషాలు పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను సినిమా అవకాశాల కోసం వెతకలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మా కమ్యూనిటీతో ఒక ఏడాది పాటు ట్రావెల్ చేసి మా రియల్ లైఫ్ ఆధారంగా ఈ కథ రాశారు. ఒకరోజు గురువు గారి ఇంటి దగ్గర షూటింగ్ చూడ్డానికి వెళ్లిన నన్ను చూసి, ఈ కథకు నేనే కరెక్ట్ అని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కెమెరా భయం ఉన్నా ఆయనే ధైర్యం చెప్పారు. రియల్ లైఫ్‌లో ఎంతో మంది ట్రాన్స్‌జెండర్స్‌పై గ్యాంగ్ రేప్స్, దాడులు జరుగుతున్నాయి. మేము పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కనీసం కేస్ కూడా తీసుకోకుండా అవమానిస్తారు. ఒక అమ్మాయిని రేప్ చేస్తే చట్ట ప్రకారం 14 ఏళ్ల జైలు శిక్ష లేదా ఎన్‌కౌంటర్ జరుగుతుంది. అదే ఒక ట్రాన్స్ ఉమెన్‌ను రేప్ చేస్తే కేవలం 6 నెలల నుండి 2 సంవత్సరాల శిక్ష మాత్రమే ఉంటుంది. రేప్ ఎవరికి జరిగినా రేపే కదా! మాకు కూడా అమ్మాయిలతో సమానంగా లీగల్ రైట్స్ కావాలనే పోరాటమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం’ అని చెప్పుకొచ్చింది హిమా రాథోడ్.

ఇక పర్సనల్ విషయానికి వస్తే.. 14ఏళ్లకే ఫ్యామిలీ వదిలెయ్యగా.. 15వ ఏట ఇల్లు వదిలి ఇప్పుడు ఇక్కడ ఉన్నానని ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కెరీర్‌పైనే నా ఫోకస్ అంటున్న ఈమె.. ఫ్యూచర్‌లో ఛాన్స్ వస్తే మళ్లీ ట్రాన్స్‌జండర్ రోల్స్ కాకుండా నార్మల్ ఫీమేల్ క్యారెక్టర్స్ (అక్క, వదిన) చేయాలనుందని తెలిపింది.

Next Story