చాలా గ్యాప్ తర్వాత రోజా వెండితెర ఎంట్రీ.. అధికారం అణచివేసినప్పుడు అంటూ ట్రైలర్ అప్డేట్

by Chukka Sudharani |

చాలాకాలం గ్యాప్ తరువాత రోజా సెల్వమణి మళ్లీ వెండితెరకు ఎంట్రీ ఇస్తుంది

చాలా గ్యాప్ తర్వాత రోజా వెండితెర ఎంట్రీ.. అధికారం అణచివేసినప్పుడు అంటూ ట్రైలర్ అప్డేట్
X

దిశ, సినిమా: చాలాకాలం గ్యాప్ తరువాత రోజా సెల్వమణి మళ్లీ వెండితెరకు ఎంట్రీ ఇస్తుంది.. అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము దులిపేసిన రోజా.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో కీలకమైన పాత్రతో ముందుకు వస్తోంది. డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘పులి మేక’ అనే టైటిల్‌ను ఫిక్స్ చెయ్యగా తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘అధికారం అణచివేసినప్పుడు.. విప్లవం పుడుతుంది..’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్‌ను షేర్ చేస్తూ ట్రైలర్ మే 29 సాయంత్రం 6గంటలకు రాబోతున్నట్లు తెలిపారు. కాగా.. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Next Story