- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శతమానం భవతి’ దర్శకుడితో ఎన్టీఆర్ బావమరిది సినిమా.. ఘనంగా ట్రైలర్ లాంచ్
సినీ ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు నార్నే నితిన్.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు నార్నే నితిన్. ఇప్పుడు ఈ హీరో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. జాతీయ అవార్డు విన్నర్ ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీకి ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్‌కు ఎన్నో డేస్ లేకపోవడంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.






