Praveen: 'బకాసుర రెస్టారెంట్‌' నుంచి భయంకరమైన ట్రైలర్‌ విడుదల..

by Chukka Sudharani |   (  Updated:2025-08-02 08:35:56  IST  )

నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ (Praveen) ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బకాసుర రెస్టారెంట్‌’ (Bakasura Restaurant)

Praveen: బకాసుర రెస్టారెంట్‌ నుంచి భయంకరమైన ట్రైలర్‌ విడుదల..
X

దిశ, సినిమా: నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ (Praveen) ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బకాసుర రెస్టారెంట్‌’ (Bakasura Restaurant). ఈ చిత్రంలో వైవా హర్ష (Viva Harsha) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్న ఈ సినిమాకు ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌(Trailer)ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ‘భకాసుర రెస్టారెంట్‌ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మా ట్రైలర్‌ మారుతి గారి చేతుల మీదుగా విడుదల కావడం హ్యపీగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం నా కెరీర్‌ సెట్‌ కావడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు మరోసారి ఆయన నా సినిమా ట్రైలర్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు’ అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. మంచి టైటిల్‌ పెట్టారు. సినిమా కూడా బాగుంటుందనే ఫీల్‌ కలుగుతుంది. మంచి టైటిల్‌ ఈ సినిమాకు పెట్టడంతో పాజిటివ్‌ వైబ్‌ ఉంది. చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ను హీరోగా చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకు కుదిరింది. డెఫినెట్‌గా ఈ సినిమా ప్రవీణ్‌ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది. తప్పకుండా ఈ మూవీ ఆడియన్స్‌ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి మూవీ యూనిట్‌ అందరికి మంచి పేరు తీసుకరావాలని అని కోరుకుంటున్నాను’ అన్నారు.

Next Story