సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘బైకర్’ ట్రైలర్

by Chukka Sudharani |

శర్వానంద్ ‘బైకర్’ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్.

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘బైకర్’ ట్రైలర్
X

దిశ, సినిమా: హీరో శర్వానంద్ నటించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘బైకర్’ నుంచి అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ వండర్‌గా కనిపిస్తోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ ప్రాజెక్టులో శర్వానంద్ ఒక పవర్‌ఫుల్ రేసర్‌గా కనిపించబోతున్నారు. జిబ్రాన్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్‌లో చూపించిన రేసింగ్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్‌ను తలపిస్తున్నాయి. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. డాల్బీ సినిమా, 4DX, PCX వంటి హై-ఎండ్ ఫార్మాట్‌లలో ఈ విజువల్ ఫీస్ట్‌ను ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. కాగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Next Story