Baby John: కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ చిత్రం నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదల

by Kodari Anjali |   (  Updated:2025-08-03 09:21:56  IST  )

కాలీస్ దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘బేబీ జాన్’

Baby John: కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ చిత్రం నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కాలీస్(Kallis) దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘బేబీ జాన్’(Baby John). ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) కథానాయికగా నటస్తోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్‌(Bollywood)లోకి ఎంట్రీ ఇస్తుంది మహానటి(Mahanati). బేబీ జాన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్(Bollywood star hero Varun Dhawan) కథానాయకుడిగా నటించగా.. జాకీ ష్రాఫ్(Jackie Shroff), వామికా గబ్బీ(Wamika Gabby).. తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. క్రిస్మస్(Christmas) కానుకగా ఈ నెల (డిసెంబరు) 25 వ తారీకున బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంతో చిత్ర బృందం కీర్తి సురేష్ కొత్త సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, కీర్తి సురేష్‌తో వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం తాజాగా మూవీ యూనిట్ వదిలిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Video Link..

Next Story