ట్యాగ్ చేస్తే చంపేస్తారా.. ఆసక్తికరంగా శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ ట్రైలర్!

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-12 11:12:30  IST  )

పెళ్లి తరవాత శోభిత నటించిన ఫస్ట్ మూవీ ‘చీకటిలో’. అయితే ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్యాగ్ చేస్తే చంపేస్తారా.. ఆసక్తికరంగా శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ ట్రైలర్!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఈ చిన్నది నటించిన ఫస్ట్ మూవీ ‘చీకటిలో’. అయితే ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. న్యూస్ ఛానల్ యాంకర్ జాబ్ మానేసి సొంతంగా ఛానల్ పెట్టి ఫ్రెండ్స్ హత్యల వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టే సంధ్య పాత్రలో శోభిత కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సినిమా టైటిల్‌కి తగ్గట్టే సేమ్ చీకటిలో ఓ సీరియల్ కిల్లర్ మర్డర్స్‌ చేస్తూ ఉంటాడు. అప్పుడు అసలు అతను అందరినీ చంపడానికి గల కారణం ఏమై ఉంటుందని శోభిత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ టైమ్‌లో ‘ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు’ అనే చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్ అయింది. ఇక చివరగా సోషల్ మీడియా పోస్టులో ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా మరి చీకటిలో క్రియేట్ చేసిన సంధ్యని.. అంటూ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ ట్రైలర్ ఎండ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆసల్యం మీరు కూడా ఈ ట్రైలర్‌ను చూసేయండి.


Next Story