Director Manoj Kumar: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-04 02:31:39  IST  )

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Director Manoj Kumar: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత అయిన మనోజ్ కుమార్(87) (Manoj kumar) శుక్రవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేశభక్తి ఇతివృత్తాలతో సినిమాలు తీయడంలో, నటించడంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన్ను అందరూ 'భరత్ కుమార్' అని కూడా పిలుస్తారు.

ఇక సినీరంగానికి మనోజ్ కుమార్ అందించిన సేవలకిగాను కేంద్ర ప్రభుత్వం ఆయనను 1992లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే, 2015లో మనోజ్‌ కుమార్ దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు అందుకున్నారు. మనోజ్ కుమార్ అసలు పేరు హరిక్రిష్ణ గోస్వామి. జులై 24, 1937లో బ్రిటిష్ ఇండియాలోని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్(ఇప్పుడు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా)లోని అబోటాబాద్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. 1957లో 'ఫ్యాషన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంచ్‌కీ గుడియా (1961)లో సయీదా ఖాన్‌తో కలిసి నటించి మంచి విజయాన్ని సాధించారు. మనోజ్ కుమార్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story