- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీ(Film industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటి బిందు ఘోష్(76) ఇక లేరు. నిన్న(ఆదివారం) మధ్యాహ్నం చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతి చెందారు. ఇవాళ (సోమవారం) ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హాస్య నటి బిందు ఘోష్(Actor Bindu Ghosh) వృద్ధాప్యంలో పలు రకాల సమస్యలతో ఆనారోగ్యానికి గురయ్యారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఆమె చికిత్సకు సహాయం చేశారు. బిందు ఘోష్ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
READ MORE ...
క్యాన్సర్‌తో బాధపడుతున్న మెగాస్టార్.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన టీమ్