- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: గుండెలుపగిలే విషాదం.. పవన్ కళ్యాణ్ అభిమాని కన్నుమూత
అరుదైన జన్యువ్యాధితో బాధపడుతూ, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన వరంగల్‌కు చెందిన ఆత్మీయ అభిమాని నిరంజన్ కన్నుమూశాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆత్మీయ వీరాభిమాని హనుమకొండ (Hanumakonda)కు చెందిన పొనుగంటి నిరంజన్ (17) ఇవాళ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత (Neuromuscular) వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. నిరంజన్ మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
కలగానే మిగిలిన ‘OG’ ముచ్చట..
అయితే, జూన్ 17న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చుని, అతడిని ఆత్మీయంగా హత్తుకుని పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. నిరంజన్ గతంలో పవన్ కళ్యాణ్ పాటలకు వేసిన డాన్స్ వీడియోలను చూసి మురిసిపోయారు. అంతా తనను ప్రేమగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా.. పవన్ ఎంతో సంతోషించారు. ఈ క్రమంలోనే తామిద్దరం కలిసి ‘OG’ సినిమా చూద్దాం.. నేను ఒకవేళ ‘OG 2’ తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్’ అంటూ పవన్ కళ్యాణ్ నిరంజన్ ప్రేమతో మాటిచ్చారు. అదేవిధంగా నిరంజన్‌కు పవన్ పలు బహుమతులతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాలను కూడా అందించారు. అయితే, ఆ తీపి జ్ఞాపకాలు జరిగి రోజులైనా గడవకముందే నిరంజన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అటు కుటుంబ సభ్యులను, పవన్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.






