Rashmi Gautami: రష్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యాంకర్

by Chukka Sudharani |

బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు.

Rashmi Gautami: రష్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యాంకర్
X

దిశ, సినిమా: బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈమె.. ప్రజెంట్ పలు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మీ ఇంట్లో ఓ విషాదం జరిగినట్లు తెలుస్తుంది. తన తాతయ్య చనిపోవడంతో.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఏమోషనల్ నోట్ షేర్ చేసింది.

ఈ మేరకు ‘చివరిగా మా తాతయ్య తనని (నానమ్మ) స్వర్గంలో కలుసుకున్నారు. నిజమైన ఫెమినిస్టు అయిన ఆయనకు ఆగస్టు 17న తుది విడ్కోలు పలికాము. ఆమెను కొల్పోయినప్పటి నుంచి ఆయన చాలా ఒంటరితనాన్ని అనుభవించారు. నానమ్మ చనిపోయి ఏడాదిన్నర అవుతుంది. కానీ తాతయ్య ప్రతి రోజు ఆమెను తలుచుకుంటూనే ఉండేవారు. ఆమె గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉండేవారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వారి ఆత్మలు విడదీయరానివి. అలాంటి వారిని మన సొంత స్వార్థపూరిత భావోద్వేగ అవసరాల కోసం మనతోనే ఉండాలని కోరుకుంటాం. కానీ మా తాతయ్యకు నానమ్మ అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మానసిక శ్రేయస్సు కోసం ఆయనకు ఆమె అవసరం. వారి ప్రేమ అలాంటింది. నిజమైన ప్రేమకు నేను స్వయంగా చూసిన ఒక ఉదాహరణ వారు’ అంటూ.. తన తాతయ్య, నాయనమ్మ ఉన్న వీడియో షేర్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story