- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy: మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Malayalam Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Malayalam Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు దిలీప్ శంకర్ (Dilip Shankar) తిరువనంతపురం (Thiruvananthapuram) లోని వాన్‌రోస్ (VanRose) జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శవమై కనిపించారు. నాలుగు రోజుల క్రితం సీరియల్ షూటింగ్ అంటూ వెళ్లిన ఆయన హోటల్‌లో విగతజీవిగా పడి ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అమ్మా అరియతే, సుందరి, పంచాగ్ని వంటి ప్రముఖ టీవీ సీరియల్స్‌లో దిలీప్ శంకర్ (Dilip Shankar) ప్రముఖ పాత్రలు పోషించి విశేష ప్రజాధరణ పొందారు. కాగా, ఆయన మరణానికి గల కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






