టాక్సిక్ అలాంటి సినిమా.. ఒక్క మాటతో అంచనాలు పెంచిన రుక్మిణి వసంత్

by Pulgam srinivas |

రుక్మిణి వసంత్ మాట్లాడుతూ… ఇప్పటివరకు నేను టాక్సిక్ రేంజ్‌ సినిమాను ఎక్కడా చూడలేదని, ఈ సినిమా కోసం యష్ పడిన కష్టం వర్ణనాతీతమని చెప్పుకొచ్చింది.

టాక్సిక్ అలాంటి సినిమా.. ఒక్క మాటతో అంచనాలు పెంచిన రుక్మిణి వసంత్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ నటి చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కె.జి.యఫ్ లాంటి భారీ విజయం తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో ఈమె ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం ఈమె పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా రుక్మిణి వసంత్ మాట్లాడుతూ… టాక్సిక్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటివరకు నేను ఈ రేంజ్ సినిమాను ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా ఒకరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఆయనే యష్. ఈ సినిమా కోసం ఆయన చేసిన కష్టం వర్ణనాతీతం. ఆయన కేవలం ఈ సినిమా కోసం కష్టపడడం మాత్రమే కాకుండా భారీగా ఖర్చు కూడా పెట్టారు. ఆయన కూడా ఇందులో నిర్మాత కావడం వల్ల ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని ఈ నటి చెప్పుకొచ్చింది. ఇలా టాక్సిక్ గురించి ఈ బ్యూటీ గొప్పగా చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

Next Story