Toxic: ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. రొమాంటిక్ సాంగ్ లోడింగ్

by Pulgam srinivas |

Toxic : ఈ సినిమాలోని "తబాహి" అంటూ సాగే పాటను మొదటి పాటగా విడుదల చేయనున్నారు. దీన్ని మార్చి 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటకు విశాల్ సంగీతం అందించడం మాత్రమే కాకుండా పాడినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

Toxic: ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. రొమాంటిక్ సాంగ్ లోడింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ నటుడు యాష్ ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు టాక్సిక్ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసినా ఒక్క పాటను కూడా విడుదల చేయలేదు. దాంతో చాలా మంది ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ మూవీ యూనిట్ తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసింది.

టాక్సిక్ యూనిట్ ఈ సినిమాలోని "తబాహి" అంటూ సాగే పాటను మొదటి పాటగా విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ను మార్చి 2వ తేదీన విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్కు విశాల్ సంగీతం అందించడం మాత్రమే కాకుండా పాడినట్లు ప్రకటించారు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ విడుదలకి సంబంధించిన అప్డేట్ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సూపర్ రొమాంటిక్గా ఉంది. దాంతో ఈ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను తెలిపే సన్నివేశంలో వస్తుందేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, తార సుతరియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.


Next Story